Translate English to Arabic Google-Translate-Chinese (Simplified) BETA Translate English to Arabic Translate English to Arabic Translate English to Croatian Translate English to Czech Translate English to danish Translate English to Dutch Translate English to Finnish Translate English to French Translate English to German Translate English to Greek Translate English to Hindi  Translate English to Italian Google-Translate-English to Japanese BETA Translate English to Korean BETA Translate English to Norwegian Translate English to Polish Translate English to Portuguese Translate English to Romanian Translate English to Russian Translate English to Russian BETA Translate English to Spanish

2012లో ఉపద్రవం రానుందా? 2012 World Renew

2012లో ఉపద్రవం రానుందా?



ఓ ప్రళయం మానవాళిని ముంచెత్తనుంది..మూడురోజులపాటు భూమిపై గాడాంధకారం..సూర్యునిపై అగ్నిశకలాల దాడి..చరిత్ర అంతానికి అది నాంది...అదే 2012 డిసెంబర్‌ 21. ప్రస్తుతం ఈ చర్చ ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. భౌగోళిక, ఆధ్యాత్మిక శాస్తవ్రేత్తలు, ఈ పెనుముప్పు తప్పదంటూ ఖరాఖండీగా తేల్చిచెప్తున్నారు. అయితే ఆధారాలు లేకుండా మాత్రం కాదు.. మయాన్‌ క్యాలెండర్‌, కొన్ని మతగ్రంధాలు, శాస్ర్తీయ పరిశోధనలు ఆధారంగా 2012న ఉపద్రవం రానుందని కచ్చితంగా చెప్తున్నారు. ఇది నిజమా కాదా? ఒకవేళ నిజమే అయితే దీన్ని తప్పించుకునేదెలా అనే అంశాలపై ఈ వారం టాప్‌ స్టోరీ స్పెషల్‌.


ప్రతి ఐదువేల నూట ఇరవై ఐదు సంవత్సరాలకొకసారి మయాన్‌ క్యాలెండర్‌ కాలపరిమితి పూర్తవుతుంది. క్రీస్తుపూర్వం 3 వేల 133వ సంవత్సరం, ఆగష్టు 11న ఈ క్యాలెండర్‌ ప్రారంభమై 2012కు పూర్తికానుంది. దాంతో భూమిపై సూర్యుని పాలన ముగుస్తుంది. ఇప్పటి వరకు ఈక్యాలెండర్‌ చెప్పినట్లు గ్రహస్థితి ఉంది. 2012కు ఈ క్యాలెండర్‌ ప్రకారం భూమిపై జీవరాశి అంతమవుతుంది. పరిశోధకులు దీనిని పరిక్షించిన తర్వాత కొన్ని లెక్కల ఆధారంగా ఇది జరగవచ్చని ప్రగాఢంగా నమ్ముతున్నారు. ముఖ్య ఆధారాల ప్రకారం: భూమి ఆస్ట్రాయిడ్‌ అనే గ్రహ శకలాన్ని ఢీకొంటుంది. అప్పుడు ఊహించని విధంగా ప్రళయం వస్తుందని నోస్ట్రడామెస్‌ అనే శాస్తవ్రేత్త తేల్చి చెప్పారు. ఖురాన్‌ ప్రకారం డూమ్స్‌డే వస్తుంది.



అంటే మహాప్రళయం అని తెలుగులో అర్థం. చైనీయుల పరిశోధనల ప్రకారం ఐచింగ్‌ అంటారు. ఐచింగ్‌ అనగా చరిత్ర ముగింపు రోజు అన్నమాట. ఎర్జర్‌అట్లాంటిస్‌ అనే శాస్తవ్రేత్త ప్రకారం ఖండం అంతరిస్తుంది. ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌ పరిశోధనలు ఏంచెప్తున్నాయంటే పోల్‌షిఫ్ట్‌ అనే ఉపద్రవం వస్తుంది. దీనర్థం ఉత్తర దృవం, దక్షిణ దృవాలు వాటి కక్ష్యలనుంచి మారిపోతాయి. ‚నాసా పరిశోధన ప్రకారం సూర్యుని నుంచి కొన్ని అగ్నిశిలాలు వచ్చి భూమిని తాకుతాయి. ఇవన్నీ ప్రళయం వచ్చే ముందు సూచనలు.
సమగ్ర విశ్లేషణ:భూమి, సూర్యుడు కలిసి మరో మహాసూర్యగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 26 వేల సంవత్సరాలుపడుతుంది. ఈ ప్రదక్షిణ 2012నాటికి పూర్తవుతుంది. అప్పుడు జీవరాశి మేల్కొంటుంది. భూమిపై అభివృద్ధి దిశగా వెళ్లడానికి కొన్ని ఆత్మలు జన్మ తీసుకున్నాయి. అవే ప్రస్తుతం జీవనం కొనసాగిస్తున్న జీవరాశులు. కోటానుకోట్ల ఈ జీవులు రానున్న ప్రళయం ద్వారా అభివృద్ధి చెందటమా? లేక నాశనమవటమా? అనేది ఆయాజీవుల మానసిక స్థితిని బట్టి నిర్ణయమవుతుంది.



ప్రేమ పూర్వకంగా: ఎవరైతే దైవికంగా జీవనం కొనసాగిస్తుంటారో, ఇతరుల ఎదుగుదలకు ప్రోత్సాహాన్నిస్తారో, తోటివారితో స్నేహభావాన్ని పెంపొందించుకుంటారో అలాంటి వాళ్లందరూ 2012 ఉపద్రవం భారిన పడరు. వారిలోని పాజిటివ్‌ ఆలోచనలు వారిని ముప్పు నుంచి రక్షిస్తాయని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. మనిషిలోని మంచితనం, ప్రేమతత్వం, సాత్విక భావనలన్నీ కూడా వారిని నాశనం కాకుండా చూస్తాయి.
చెడు తుడిచిపెట్టుకుపోతుంది:ఎవరైతే ఎప్పుడూ దుఃఖంలో మునిగిఉంటారో, ఈర్ష్య, అసూయలతో నిండిఉంటారో, ఇతరులతో ఎప్పుడూ గొడవపడతుంటారో అటువంటి వాళ్లు ఈ ప్రళయాగ్నికి బలవ్వక తప్పదు. వచ్చే మార్పును అంగీకరిస్తూ దానికి తగ్గట్టుగా తమను తాము మంచిగా మలుచుకుంటారో అటువంటి వాళ్లకు చాలా ప్రయోజనాలున్నాయి. ముప్పు నుంచి తప్పించుకోవడమే కాదు...ఉన్నతమైన శక్తిమంతు లుగా తయారవుతారు.

పోటాన్‌ శక్తి:ప్రళయం సంభవించిన తర్వాత విడుదలయ్యే పోటాన్‌శక్తి వలన మంచి దారిలో నడిచేవారికి నాలుగింతల లాభం చేకూరుతుంది. మంచి వాళ్లు ఇంకా శక్తివంతులవుతారు. సహజంగా మనిషి శరీరంలో ఆరుచక్రాలే ఉంటాయి. ప్రళయం తర్వాత పాజిటివ్‌ ఎనర్జీ ఉన్నవాళ్లకు 13 చక్రాలు అంకురిస్తాయి. దీంతో మనిషే దేవుడుగా తయారవుతాడు. భూమి భౌగోళిక స్థితిగతి మారిపోతుంది. ప్రాణశక్తి ఎక్కువగా ఇనుమడిస్తుంది. మూడు రోజులపాటు భూమిపై చీకటి అలుముకుని ఉండి ఆ తర్వాత తిరిగి తన శక్తిని భూమి పుంజుకుంటుంది. దీని వలన కొన్ని మార్పులు సంభవిస్తాయి.

అనూహ్యమైన మార్పులు: ఈ ప్రళయం తర్వాత జీవించిఉన్న మంచి జీవరాశిలో కొన్ని మార్పులు వస్తాయి. ప్రస్తుతమున్న 2 డిఎన్‌ఎ మనిషి కాస్తా 12 డిఎన్‌ఎ మనిషిగా మారిపోతాడు. ఆ వ్యక్తి అతి తక్కువ సాంధ్రత గల వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు. అంటే ఎటువంటి దుఃఖంలేని సంతోషదాయకమైన ఆలోచనలతో కూడిన వ్యక్తి అన్నమాట. మొత్తంమీద ఓ సూపర్‌మెన్‌గా తయారవుతాడు. పోటాన్‌ శక్తి వలనే మానవశరీరంలో ఈమార్పులన్నీ జరుగుతాయి. సౌరకుటుంబాలు, గ్రహస్థితులలో కొత్త ఒరవడి కనబడతుంది.

మనకు అనుగుణంగా....


2012 ఉపద్రవం మంచివాళ్లకు మరింత మంచిదిగాను, చెడ్డవాళ్లకు కఠినమైన శిక్షగాను ఉంటుంది. దీన్ని మనకు అనుగుణంగా మలుచుకుని దివ్యత్వం గల మనుషులుగా రూపాంతరం చెందాలంటే ఇప్పట్నుంచే మంచి ఆలోచనలను మనలోకి ఆహ్వానించాలి. వచ్చే మార్పును అంగీకరించగలగాలి. మనలోని నెగెటివ్‌ ఎనర్జీని పాజిటివ్‌ ఎనర్జీగా మార్చుకుని ముప్పు నుంచి తప్పించుకోవాలి.

పిరమిడ్‌ శాస్త్రం ప్రకారం: మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. యోగ, ధ్యానాలను జీవనశైలిలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ముఖ్యంగా పిరమిడ్‌లకు ప్రాణశక్తిని ఇచ్చే గుణాలు ఎక్కువ. ఈజిప్టులోని పిరమిడ్‌లను గనుక పరిశీలిస్తే అక్కడ కొన్ని నిర్ధారణలు చేశారు. విశ్వంలోని పాజిటివ్‌ ఎనర్జీని తీసుకునే శక్తి పిరమిడ్‌లకు ఉంది. వాటిలోపల కూర్చుంటే మనలోని నెగెటివ్‌ ఆలోచనలన్నీ పారిపోతాయి. మనసు తేలకవుతుంది. పిరమిడ్‌ శాస్త్రం ప్రకారం ఉపద్రవాల నుంచి తప్పించుకోవాలంటే పిరమిడ్‌లు చాలా సహకరిస్తాయి. ఈ పిరమిడ్‌లకు ఉపయోగించే కొలతలలోనే ఈ శక్తి దాగి ఉంది.

ప్రస్తుతం చెక్క, ప్లాస్టిక్‌ పిరమిడ్‌లను వివిధ సైజుల్లో తయారుచేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. వీటిని ఇంటిలో పెట్టుకుని వాటి కింద కాసేపు ధ్యానం చేస్తే విశ్వంలోని కాస్మిక్‌ ఎనర్జీని మనసొంతం చేసుకోవచ్చు. పిరమిడ్‌లున్న చోట ప్రమాదాలు సంభవించవు అన్నది ఇటీవలే నాగ్‌పూర్‌లో ప్రయోగాత్మకంగా నిరూపించారు. అక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటే చిన్న సైజుల్లో పిరమిడ్‌లను తయారుచేసి ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట ఉంచారు. అప్పట్నుంచి ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. ఈ పిరమిడ్‌లు ఇప్పుడు టోపీల రూపంలో కూడా దొరుకుతున్నాయి. అవి తలకు పెట్టుకుని ధ్యానం చేస్తే చాలా మంచిది. ఏవైనా పనులు చేసుకున్నప్పుడు కూడా ఇంటిలో ఉన్న చెక్క పిరమిడ్‌ల కింద పెట్టుకుని కూర్చుని పనిచేస్తే ఎంతో ఆరోగ్యకరం. టేబుల్‌ పిరమిడ్‌, ‘ఐ’ పిరమిడ్‌, స్టడీ పిరమిడ్‌..ఈవిధంగా చాలా రకాలుగా వివిధ సైజుల్లో పిరమిడ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ఎనర్జీని ఉపయోగించుకుంటూ మనలోని నెగెటివ్‌ను దూరంచేసుకోవాలి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా తట్టుకునే శక్తిని ఇనుమడింపచేసుకోవాలి.
ప్రళయం సంభవించిన తర్వాత విడుదలయ్యే పోటాన్‌శక్తి వలన మంచి దారిలో నడిచేవారికి నాలుగింతల లాభం చేకూరుతుంది. మంచి వాళ్లు ఇంకా శక్తివంతులవుతారు. సహజంగా మనిషి శరీరంలో ఆరుచక్రాలే ఉంటాయి. ప్రళయం తర్వాత పాజిటివ్‌ ఎనర్జీ ఉన్నవాళ్లకు 13 చక్రాలు అంకురిస్తాయి. దీంతో మనిషే దేవుడుగా తయారవుతాడు

Free Web Hosting with Website Builder

1 comments:

Unknown said...

ప్రతి నగరానికీ మనిషిని బతకడానికి వెళ్తే... కాశీకి మాత్రం చావడానికి వెళ్తారు. అలా ఈ భూగోళమంతా ప్రళయకాశీగా మారనుందా...
అంతకంటే కావల్సింది ఏముంది. ఉద్యమాలవల్ల అనుకున్నది సాధ్యం కాకుకున్నా అంతో ఇంతో అభివృద్ది లభిస్తుందంటారు. అలాగ ఈ ఆలోచనలతో మొత్తానికి ఏదో మేలు జరగబోతుంది కాబోలు... ఇది నా స్వంత అభిప్రాయము... ఆది. అందరిలో ఒకడు...