జాబిల్లిపై తొలి అడుగు , Moon in first

జాబిల్లిపై తొలి అడుగు
మనిషి మరో గ్రహంపై అడుగుపెట్టేందుకు దాదాపు అయిదు దశాబ్దాల కిందే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. భూమికి అతి సమీపంలో ఉన్న గ్రహం చంద్రుడు. చంద్రగ్రహంపై మానవుడు అడుగులు వేసిన చరిత్మాత్మక ఘట్టం జరిగి ఇప్పటికి నలభై ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆనాటి చంద్రగ్రహ యాత్ర గురించిన కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలు...


1960ల నుంచే ప్రయత్నాలు

మనిషిని అంతరిక్షంలోకి పంపేందుకు అమెరికా 1960లలో ప్రయత్నాలు ప్రారంభించింది. అపోలో పేరుతో వరసగా అంతరిక్ష నౌకలను ప్రయోగించడం మొదలు పెట్టింది. చివరికి అపోలో 11 ప్రయోగంతో మనిషి చందమామపై కాలుమోపడం సాధ్యమైంది.


చంద్రగ్రహంపైకి ముగ్గురు

-అపోలో11 అంతరిక్ష నౌక ముగ్గురిని చంద్రునిపైకి తీసుకెళ్లింది. ఈ యాత్రలో ముగ్గురూ కొన్ని బాధ్యతల్ని నిర్వహించారు.

-మిషన్‌ కమాండర్‌ నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌. కమాండ్‌ మాడ్యూల్‌ పైలట్‌ మైకేల్‌ కోలిన్స్‌. లూనార్‌ మాడ్యూల్‌ పైలట్‌ ఎడ్విన్‌ ఇ. ఆల్డ్రిన్‌ చంద్రగ్రహ యాత్రికులు.


ఇలా సాగింది చంద్రయాత్ర...

-చంద్రునిపైకి మనిషిని పంపడం ఆనాడు ఓ అద్భుతం. అమెరికా ఆ అద్భుతాన్ని ఆవిష్కరించింది.

-1969 జూలై 16వ తేదీ ఉదయం 9.32 గంటలకు కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలోని లాంచ్‌ కాంప్లెక్స్‌ 39లో ప్యాడ్‌ ఏ నుంచి అపోలో 11 అంతరిక్ష నౌకను ప్రయోగించారు.

-అపోలో శాటర్న్‌ 5 సీరీస్‌లోని ఎఎస్‌-506 ప్రయోగ వాహక నౌక నుంచి ఈ ప్రయోగం జరిగింది. నాసా ప్రజా సమాచారశాఖ అధిపతి జాక్‌ కింగ్‌ కళ్లకు కట్టినట్టు ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యానించారు.

-అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ వైట్‌ హౌస్‌లోని ఓవల్‌ ఆఫీస్‌ నుంచి అపోలో 11 నింగిలోకి దూసుకెళ్లడాన్ని చూశారు.

-12 నిముషాల తర్వాత అపోలో 11 వాతావరణంలోని మొదటి కక్ష్యలో ప్రవేశించింది. ఒకటిన్నర కక్ష్యలు దాటిన తర్వాత నౌకలోని మూడో దశ ఇంజన్‌ అంతరిక్ష నౌకను చంద్రుని దిశగా మరల్చింది.

-మరో అరగంట తర్వాత కమాండ్‌/ సర్వీస్‌ మాడ్యూల్‌ భాగాలు ప్రయోగ వాహక నౌక నుంచి విడిపోయాయి. అప్పటి నుంచి లూనార్‌ మాడ్యూల్‌ చంద్రగ్రహ యాత్ర ప్రారంభమైంది.

-జూలై 19న అపోలో 11 చంద్రుని వెనక భాగాన్ని చేరింది. తాము దిగబోయే సీ ఆఫ్‌ ట్రాన్‌క్విలిటీ ప్రాంతా న్ని అంతరిక్ష యాత్రికులు చూశారు. ఇది చంద్రుని దక్షిణ ప్రాంతంలో ఉంది. నైరుతి దిశలో సబైన్‌ డి క్రేటర్‌ కనిపించింది.

-1969 జూలై 20న లూనార్‌ మాడ్యూల్‌ (ఎల్‌ఎం) కమాండ్‌ మాడ్యూల్‌ (సిఎం) నుంచి విడివడింది. కొలంబియాలో ఉన్న కోలిన్స్‌ ఈగిల్‌ ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా ఎలా దిగాలో పరిశీలించారు.

- చంద్రుని ఉపరితలంపై క్రమంగా దిగడం ప్రారంభమయ్యాక లూనార్‌ వేగం వల్ల దిగాల్సిన ప్రాంతాన్ని దాటిపోయారు. తర్వాత కంట్రోల్‌ స్టేషన్‌ సహాయంతో దిగే ప్రాంతాన్ని నిర్ణయించుకున్నారు.

-జూలై 20వ తేదీ భూమిపై కాలమానం ప్రకారం రాత్రి 8.17 గంటలకు వెస్ట్‌ క్రేటర్‌ ప్రాంతంలో చంద్రునిపై ఈగిల్‌ దిగింది.

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ తొలి అడుగు

-అంతరిక్ష యాత్రికుడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ తొలిసారి చంద్రునిపై కాలుమోపారు. అక్కడి నుంచి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ హోస్టన్‌లోని కంట్రోల్‌ స్టేషన్‌తో మొదటిసారి మాట్లాడారు.

-చంద్రుని పై నుంచి ఆర్మ్‌స్ట్రాంగ్‌ మాట్లాడిన మొదటి మాటలు! ‘హోస్టన్‌! ఇక్కడ ట్రాంక్విలిటీ బేస్‌ ఉంది. ఈగిల్‌ దిగింది’ అని చెప్పారు. చంద్రునిపై కాలుమోపిన తర్వాత నీల్‌ ‘ఇది చంద్రునిపై మనిషి వేసిన చిన్న అడుగు. కానీ మానవాళి చేసిన పెద్ద ప్రయత్నం’ అన్నారు.

-చంద్రునిపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నడుస్తుంటే తేలిపోతున్నట్టు భూమిపై టీవీల్లోను, కంట్రోల్‌ స్టేషన్‌లోను కనిపించింది.

-ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై దిగిన ఆరున్నర గంటల తర్వాత ఎడ్విన్‌ ఆల్‌డ్రిన్‌ కూడా దిగారు.

-అనంతరం వారు చంద్రునిపై తమ గుర్తుగా అమెరికా పతాకాన్ని ప్రతిష్టించారు. ఉపరితలంపై ఉన్న శిలల్ని, మట్టిని పరిశోధనలకోసం సేకరించారు.

ఆ పెన్ను, సర్క్యూట్‌ బ్రేకర్‌ ఇప్పటీకి ఉన్నాయి: అల్డ్రిన్‌

డేటాన్‌ : జీవితంలో అపురూప ఘట్టాలను ఎవరూ మర్చిపోలేరు. అది సాహసంతో కూడినదైతే ఇక చెప్పక్కర్లేదు. 40 ఏళ్ళ క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో కలిసి చంద్రుడిపై కాలు పెట్టిన వ్యోమగామి ఆల్డ్రిన్‌(79) కూడా ఆనాటి సంగతులను అలాగే గుర్తుంచుకున్నారు. భూమికి తిరిగి వచ్చేందుకు పయనమైన సమయంలో అపోలో 11లో ఇంజన్‌ కదిలేందుకు స్విచ్‌గా ఉపయోగించిన పెన్నును ఆల్డ్రిన్‌ భద్రంగా దాచుకున్నారు. తనకు అరుదైన జ్ఞాపకాన్ని మిగిల్చిన ఆ పెన్నుతో పాటు సర్క్యూట్‌ బ్రేకర్‌ (స్విచ్‌)ను కూడా తన దగ్గర ఇంకా ఉన్నాయని ఆల్డ్రిన్‌ విలేకరులకు తెలిపారు. డేటాన్‌లోని ఒక బుక్‌స్టోర్‌లో ఆయన మాట్లాడారు. తన కొత్త పుస్తకం కాపీలపై ఆటోగ్రాఫ్‌ను కూడా ఇచ్చారు.


చంద్ర విలల నుంచి మరిన్ని రహస్యాలు

వాషింగ్టన్‌: నలభై ఏళ్ల క్రితం(1969) అపోలో-11 వ్యోమ గాములు చంద్రుడిపై సేకరించిన శిలల నుంచి ఇప్పటికీ మరిన్ని రహస్యాలను రాబట్టవలిసివుందని శాస్తవ్రేత్తలు చెపుతున్నారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సెయింట్‌ లూరుూస్‌ (డబ్ల్యుయు ఎస్‌టిఎల్‌)లోని భూ మరియు గ్రహాల శాస్త్ర విభాగంలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాండీ ఎస్‌ కొరొటెవ్‌ 1969 నుంచి ఈ శిలలపై అధ్యయనం చేస్తున్న బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ‘ఇప్పటికీ తాము ఎంతో తెలుసుకోవాల్సి వుంది. ఈ నమూనాలను పరిశీలిస్తున్నాము’ అని ఆయన వ్యాఖ్యానించారు. కొరెటెవ్‌ ప్రధానంగా చంద్రుడి చారిత్రక నేపథ్యం, దాని ఉపరితలం ఉల్కా పాతాలకు ఎలా ప్రభావితమైంది తదితర అంశాలపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. మరిన్ని సమాధా నాలు రావాల్సివుందని, అపోలో 11 తీసుకువచ్చిన నమూనాలను క్షుణ్ణంగా పరిశోధిస్తున్నట్టు కొరెటెవ్‌ వెల్లడించారు.

Free Web Hosting with Website Builder
Read more...